బిగ్‌బాస్ ఏడో సీజన్.! ఇది కూడా ఫ్లాప్ షోనేనా.?
- October 02, 2023
బుల్లితెరపై క్రేజీయెస్ట్ గేమ్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్‌బాస్ గేమ్ షో. అయితే, కొన్ని సీజన్లుగా బిగ్‌బాస్‌కి అంత సీనూ సినిమా లేకుండా పోతోంది. కానీ, బిగ్‌బాస్ ఏడో సీజన్ మాత్రం ఉల్టా పుల్టా అనే క్యాప్షన్‌తో వచ్చి మొదటి నుంచీ ఒకింత ఆసక్తి కలిగించింది.
మొదటి రెండు వారాలు బిగ్‌బాస్ బాగానే నడిచింది. ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. టీఆర్‌పీ రేటింగులు కూడా ఫర్వాలేదనిపించింది. కానీ, ఆ హైప్‌ని కంటిన్యూ చేయలేకపోయింది బిగ్‌బాస్.
మూడో వారానికి కాస్త చప్పబడింది. ఇక నాలుగో వారానికి దాదాపు జీరో అయిపోయింది. అందుకు కారణం బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో క్రేజీయెస్ట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రతికను సింపుల్‌గా ఎలిమినేట్ చేసేయడమే.
అసలే బిగ్‌బాస్ అంటేనే గ్లామర్. ఆ గ్లామర్‌ని వరుసగా తగ్గించుకుంటూ పోతున్నారు ఎందుకో తెలీదు ఈ సీజన్ నిర్వాహకులు. నాలుగు ఎలిమినేషన్లు జరిగితే, నాలుగింట్లోనూ అమ్మాయిల్నే ఎలిమినేట్ చేస్తూ వచ్చారు.
ఇక, రతికను ఎలిమినేట్ చేయడంతో ఇక బిగ్‌బాస్‌కి ఎండ్ కార్డ్ పడిపోయినట్లే అని ఫిక్స్ అయిపోయారు. బిగ్‌బాస్ క్వీన్ రతిక.. ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ ఆమెనే అని ఫిక్స్ అయినవాళ్లంతా చాలా డిజప్పాయింట్ అయ్యారు. లేటెస్ట్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ వీక్షించే వాళ్ల సంఖ్య దాదాపు తగ్గిపోతుంది. హైప్ పెరగాలంటే బిగ్‌బాస్ ఇంకేదో మ్యాజిక్ చేయాల్సిందే.! చూడాలి మరి ఆ మ్యాజిక్ ఏంటో.!
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







