‘స్కంధ’ అయినా నిలదొక్కుకోలేకపోయిందే.!

- October 02, 2023 , by Maagulf
‘స్కంధ’ అయినా నిలదొక్కుకోలేకపోయిందే.!

సెలవుల సీజన్ సినిమాలకు బాగా కలిసొచ్చే అంశమే అని చెప్పాలి. అలాంటిది ఐదు రోజుల సెలవుల్ని సైతం క్యాష్ చేసుకోలేకపోయింది లేటెస్ట్ మూవీ ‘స్కంధ’. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘స్కంధ’ భారీ అంచనాలతో రిలీజైన సంగతి తెలిసిందే.

రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాకి బోయపాటి శీను దర్శకుడు. అదిరిపోయే మాస్ మసాలా మెటీరియల్‌తో ఈ సినిమాని బోయపాటి శీను తెరకెక్కించారు. అనుకున్నా.. అనుకోకపోయినా.. ఈ సినిమాకి సెలవులు బాగా కలిసొచ్చాయ్.

కానీ, ఓపెనింగ్స్ అంతంత మాత్రమే అనిపించుకుంది ‘స్కంధ’. మాస్ ఆడియన్స్‌కి మాత్రమే ఎక్కే సినిమా అని ముద్ర వేయించుకుంది. పోనీ.. అదే పోనీ.. మాస్ ఆడియన్స్‌ని అయినా గట్టిగా టార్గెట్ చేసిందా.? అంటే అదీ జరగలేదు. రెండో రోజుకే చేతులెత్తేసింది. సెలవులు కలిసొచ్చి సినిమాకి వసూళ్లు ఏమైనా పెరిగాయా.? అంటే అదీ జరగలేదు.

ఇక వీక్ డేస్ స్టార్ట్ అయ్యాయ్. మరి ఈ వారం స్కంధ నిలదొక్కుకోవడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయ్. రామ్ పోతినేని కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా తెలుగుతో పాటూ, పలు ఇతర భాషల్లోనూ రిలీజైన ఈ సినిమా ఆశించిన రిజల్ట్ అయితే అందుకోలేకపోయింది. తద్వారా సినిమాని ఫెయిల్యూర్ లిస్టులో పడేశారు ట్రేడ్ మేథావులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com