నిత్యా మీనన్ అలా డిసైడ్ అయ్యిందా.?

- October 02, 2023 , by Maagulf
నిత్యా మీనన్ అలా డిసైడ్ అయ్యిందా.?

హీరోయిన్ల యందు నిత్యా మీనన్ వేరయా.! అంటే అతిశయోక్తి కాదేమో. అవును నిత్యా మీనన్ సినిమాకి సైన్ చేసిందంటే.. ఖచ్చితంగా ఆ సినిమాలో విషయముంటుంది. అలాగే ఆమె పాత్రలోనూ ఏదో కొత్తదనం వుంటుంది.. అనే అభిప్రాయాలుంటాయ్.

అందుకే గ్లామర్‌తో పని లేకుండా ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి భార్యగా నటించింది ఇటీవల నిత్యా మీనన్. తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది ‘కుమారి శ్రీమతి’గా. అవునండీ ఆమె నటించిన వెబ్ సిరీస్ పేరే ‘కుమారి శ్రీమతి’.

పల్లెటూరి అందాలకు అద్దం పడుతూ, తన తాతల ఆస్థిని కాపాడుకునేందుకు ఓ ఆడపిల్ల పడే తపన, తాపత్రయం ఈ సిరీస్‌లో శ్రీమతి పాత్ర ద్వారా నిత్యా మీనన్ చూపించింది.

క్యూట్‌గా వుంటుంది కదా.. ఆమెకు ఈ పాత్ర కూడా అంతే క్యూట్‌గా సెట్టయిపోయింది. డైలాగులు బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ ఆహ్లాదంగా వుంది. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘కుమారి శ్రీమతి’ ఓటీటీ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది.

అన్నట్లు ఈ సిరీస్‌లో బుల్లితెర హీరో శ్రీరామ్ పరిటాల అదేనండీ డాక్టర్ బాబు ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com