దానిమ్మ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు.!
- October 02, 2023
చూడ్డానికి ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా వుండే దానిమ్మ పండును తినేందుకు ఇష్టపడని వారుంటారా.. చెప్పండి. కానీ కొందరు దానిమ్మ పండును తినాలంటే ఆలోచిస్తారు. కానీ, ఎలాంటి ఆలోచనా లేకుండా తినగలిగే పండు దానిమ్మ. దానిమ్మతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
బీపీలూ, షుగర్లు వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారు సైతం దానిమ్మ పండును నిరభ్యంతరంగా తినేయొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటూ, దానిమ్మలో బోలెడంత ఐరన్ లభిస్తుంది. విటమిన్ సి, ఇ.. ఈ పండులో పుష్కలంగా లభిస్తాయ్.
అలాగే, కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలనుకునేవారు ప్రతీరోజూ దానిమ్మ పండు తినడం ఎంతో ఉత్తమం. రక్థ హీనత సమస్య వున్న వారు కూడా ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో దానిమ్మను తీసుకోవాలి.
దానిమ్మను తొక్క తీసి గింజల రూపంలో తినొచ్చు. లేదంటే, జ్యూస్‌లా కూడా చేసుకుని తాగొచ్చు. దానిమ్మ జ్యూస్‌లో కొన్ని చియా సీడ్స్ వేస్తే ఇంకాస్త రుచికరంగా వుండడంతో పాటూ, శరీరానికి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది.
రోగ నిరోధక శక్తి తక్కువగా వున్నవారు దానిమ్మను తీసుకోవడం అస్సలు మర్ఛిపోవద్దు. ఇమ్యూనిటీ శక్తి దానిమ్మ పండుకు చాలా చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







