ప్రవాసుల జనాభా తగ్గుదలతో పెరిగిన ఖాళీ అపార్ట్‌మెంట్లు

- October 02, 2023 , by Maagulf
ప్రవాసుల జనాభా తగ్గుదలతో పెరిగిన ఖాళీ అపార్ట్‌మెంట్లు

కువైట్: ప్రవాసుల తొలగింపులో పెరుగుదల కారణంగా కువైట్‌లో ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్ల సంఖ్య పెరిగింది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ఆస్తి అమ్మకాలు తగ్గాయి. కువైట్‌లో ఈ సంవత్సరం ప్రథమార్థం చివరి నాటికి జనావాసాలు లేని అద్దె పెట్టుబడి అపార్ట్‌మెంట్ల సంఖ్య దాదాపు 50,000కి చేరుకుంది. అధికారిక నివేదిక ప్రకారం.. నివాస ప్రాపర్టీ అమ్మకాలు KD 363 మిలియన్లకు చేరుకుంది. ఇది 2020 రెండవ త్రైమాసికం నుండి ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ప్రవాసులకు సందర్శన వీసాలు మంజూరు చేయడంపై పరిమితులు కూడా ఖాళీ అపార్ట్‌మెంట్‌ల పెరుగుదలకు దోహదపడ్డాయి. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రవాస జనాభా వృద్ధి రేటులో భారీ తగ్గుదల నమోదయింది. గత ఐదేళ్లలో వృద్ధి 5 శాతం నుంచి దాదాపు 1.8 శాతానికి పడిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com