వాహన బీమా ఉల్లంఘనపై ఇ-మానిటరింగ్ ప్రారంభం
- October 03, 2023
జెడ్డా: సౌదీ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అక్టోబర్ 1 నుంచి వాహన బీమా ఉల్లంఘనపై ఇ-మానిటరింగ్ చేయడం ప్రారంభించింది. అన్ని నగరాలు, గవర్నరేట్లలో వర్తింపజేయనున్నట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా లేనప్పుడు వాహనం యొక్క ఉల్లంఘన ప్రతి 15 రోజులకు ఒకసారి ఎలక్ట్రానిక్‌గా పర్యవేక్షించబడుతుందన్నారు. అబ్షర్ ప్లాట్‌ఫారమ్‌లో లబ్ధిదారుని ఖాతాలోకి లాగిన్ చేయడం, వాహన సేవలకు వెళ్లడం, విచారణలు, ఆపై వాహన బీమా చెల్లుబాటును ఎంచుకోవడం వంటి ఐదు దశల ద్వారా వాహన బీమా చెల్లుబాటు గురించి విచారించవచ్చని తెలిపింది. వాహన బీమా లేకపోతే కనీస జరిమానా SR100, గరిష్టంగా SR150 విధించనున్నట్లు హెచ్చరించారు. వాహన డ్రైవర్లు, పౌరులు, ప్రవాసులు ట్రాఫిక్ నిబంధనలు, సూచనలను పాటించాలని, అలాగే ఏదైనా ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినప్పుడు చెల్లుబాటు అయ్యే బీమా ఎంతో ఉపయోగపడుతుందని డిపార్ట్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







