యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన అమీర్
- October 03, 2023
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సోమవారం మధ్యాహ్నం దోహా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తన సహచర ప్రతినిధి బృందంతో ఘన స్వాగతం పలికారు. ఎక్స్పో 2023 దోహా ప్రారంభోత్సవంలో యూఏఈ అధ్యక్షుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ వ్యక్తిగత ప్రతినిధి షేక్ జాసిమ్ బిన్ హమద్ అల్ థానీ కూడా ఉన్నారు. అమీరి దివాన్ అధిపతి హెచ్ఇ షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ, ఖతార్ లోని యూఏఈ రాయబారి హెచ్ఇ షేక్ జాయెద్ బిన్ ఖలీఫా బిన్ సుల్తాన్ బిన్ షఖ్బౌత్ అల్ నహ్యాన్ కూడా యుఎఇ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







