లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య
- October 03, 2023
హైదరాబాద్: లండన్ లో ఘోరం జరిగింది.. ఉపాధి కోసం వలస వెళ్లిన హైదరాబాదీపై దాడి జరిగింది. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఆయన దగ్గర ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లారు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆసుపత్రికి తరలించేలోగానే ఆయన ప్రాణం పోయింది. ఆయనతో పాటు ఆఫ్ఘనిస్థాన్ జాతీయుడు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. లండన్ పోలీసులు, మృతుడి కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ కు చెందిన ఖాజా రయీసుద్దీన్ 2011లో ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అప్పటి నుంచి వెస్ట్ యార్క్ షైర్ లోని లీడ్స్ లో నివసిస్తున్నాడు. ఈ నెల 5న హైదరాబాద్ లో కూతురు వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేందుకు రయీసుద్దీన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన స్నేహితుడు ఆఫ్ఘనిస్థాన్ దేశస్తుడితో కలిసి బయటకు వెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళుతుండగా ఉగాండా జాతీయుడిగా అనుమానిస్తున్న దుండగుడు దాడి చేశాడు.
కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో స్నేహితులిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులతో దుండగుడు పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా రయీసుద్దీన్ తో పాటు అతడి స్నేహితుడు కూడా చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, రయీసుద్దీన్ మృతదేహాన్ని వీలైనంత తొందరగా హైదరాబాద్ కు చేర్చేలా చూడాలని బాధిత కుటుంబం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







