అయ్యో పాపం.! కాజల్‌కే ఎందుకిలా.?
- October 03, 2023
కోవిడ్ టైమ్‌లో పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి జన్మనిచ్చి తల్లి ప్రేమ అనుభూతిని కూడా ఎంజాయ్ చేసేసింది అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత మళ్లీ సినిమాలు కంటిన్యూ చేస్తూ కెరీర్‌నీ చక్కదిద్దుకుంటోంది.
‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించాల్సి వుండగా.. ఆఖరి నిముషంలో ఆమె పాత్రను లేపేశారు. సినిమా ఫైనల్ అవుట్ పుట్లో ఇబ్బందికరంగా వుందంటూ కాజల్ పాత్రను ఆ సినిమాలో డిలీట్ చేయడం జరిగింది.
ఆ ముచ్చట ఇంకా మరువకముందే, మళ్లీ కాజల్‌కి అన్యాయం జరిగిందంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సారి నందమూరి నట సింహం బాలయ్య సినిమాలో కాజల్‌కి ఆ అన్యాయం జరిగిందట.
బాలయ్య హీరోగా ‘భగవంత్ కేసరి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీలీల ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. కాగా, ఈ సినిమాకీ హీరోయిన్ రోల్ కాస్త అడ్డంకిగానే వుందనిపించిందట. దాంతో, నిరభ్యంతరంగా కాజల్ క్యారెక్టర్ లేపేశారనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఈ గుసగుసలో నిజమెంతో కానీ, ఒకవేళ అదే జరిగితే, కాజల్ కెరీర్‌కి పెద్ద దెబ్బే అది. కాజల్ కానీ, చిత్ర యూనిట్ కానీ, రెస్సాండ్ అయితే తప్ప, ఈ గాసిప్‌లో నిజమెంతో తెలీదు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







