దోహా ఫోరమ్‌ ఈ రోజు ప్రారంభం

- May 21, 2016 , by Maagulf
దోహా ఫోరమ్‌ ఈ రోజు ప్రారంభం

మరిస్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని, 16వ దోహా ఫోరమ్‌ని షెరటాన్‌ దోహా హోటల్‌లో ఈ రోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. 'స్టెబిలిటీ అండ్‌ ప్రోస్పరిటీ' నినాదంతో ఈ కార్యక్రమం జరగనుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, స్థానిక మరియు అంతర్జాతీయ రీసెర్చ్‌ అండ్‌ స్టడీ సెంటర్స్‌తో కలిసి ఈ ఫోరమ్‌ని నిర్వహిస్తున్నాయి. ప్రెసిడెంట్స్‌, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, తదితరులు ఈ ఫోరమ్‌లో పాల్గొంటున్నారు. 58 మంది ప్రముఖులు ఈ ఫోరమ్‌లో వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. ఎకానమీ, ఎనర్జీ, సెక్యూరిటీ మరియు డిఫెన్స్‌ విభాగాలపై ఈ ప్రసంగాలు సాగుతాయి. తొలి ప్లీనరీ సెషన్‌ 'ఇంటర్నేషనల్‌ అండ్‌ రీజినల్‌ స్టేటస్‌ కో అండ్‌ ది మీన్స్‌ టు మీట్‌ ది ఛాలెంజెస్‌' థీమ్‌తో సాగుతుంది. రెండో ప్లీనరీ సెషన్‌ 'ది మిడిల్‌ ఈస్ట్‌: టువార్డ్స్‌ మోర్‌ స్టేబిలిటీ అండ్‌ ప్రోస్పరిటీ' థీమ్‌తో సాగుతుంది. గ్లోబల్‌ ఎకానమీ: వేర్‌ టు అనే అంశం మీద కూడా ఈ ఫోరమ్‌లో చర్చ జరుగుతుంది. ఇంకా పలు అంశాలపై ప్రముఖులు ఈ ఫోరమ్‌లో చర్చిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com