కిరణ్ అబ్బవరం‌కి బిగ్‌బాస్ రతికకూ ఏంటీ సంబంధం.?

- October 04, 2023 , by Maagulf
కిరణ్ అబ్బవరం‌కి బిగ్‌బాస్ రతికకూ ఏంటీ సంబంధం.?

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా వచ్చి ఈ సారి సీజన్‌పై ఆసక్తి పెంచేలా చేసింది అందాల భామ రతిక. కానీ, ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, మొదటి రెండు వారాల్లో వున్న జోష్, తర్వాత నుంచి రతికలో కనిపించలేదు.

అసలు సిసలు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా రతికను అభివర్ణించారంతా. కానీ, హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్లంతా కలిసి రతికపై మూకుమ్మడి దాడికి దిగారు. ఆమెను వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి హోస్ట్ నాగార్జున సైతం రతికను టార్గెట్ చేసేశాడు.

దాంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. సరిగ్గా ఆడలేకపోయింది. నాలుగో వారం సింపుల్‌గా రతికను బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసేశారు. నిజంగానే ఇది ఆడియన్స్ నిర్ణయమా.? లేక బిగ్‌బాస్ జిమ్మిక్‌లో భాగమో తెలీదు కానీ, ఇప్పుడు రతిక మ్యాటర్ హీరో కిరణ్ అబ్బవరాన్ని తాకింది.

త్వరలో ఆయన నటించిన ‘రూల్స్ రంజన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సాగిన సోషల్ మీడియాలో ప్రమోషన్లలో ఈ సినిమా తర్వాత రతిక లాంటి అమ్మాయితో పెళ్లి చేసుకొని సెటిలైపో బాస్.. అంటూ ఓ నెటిజన్ కిరణ్ అబ్బవరానికి సలహా ఇచ్చాడు.

పెళ్లయితే ఓకే కానీ, ఎలాంటి అమ్మాయి కావాలని నువ్వులా డిసైడ్ చేస్తావ్ బాస్.! మరీ ఇంత పగా.? నా మీద అని కిరణ్ రిప్లై ఇచ్చాడు. అంటే రతికలాంటి అమ్మాయి నాకొద్దు బాబూ.! అని కిరణ్ ఉద్దేశ్యమా.? అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com