పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- October 04, 2023
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు. ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ కు కృష్ణానీటి కేటాయింపు పై క్యాబినెట్లో నేడు చర్చలు జరిగాయి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ఆమోదం తెలిపింది. అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కూడా ఆమోదం తెలిపింది. ఏపీ-తెలంగాణ మధ్య నీటిని కేటాయించాలని కేంద్రం ఆదేశించింది. ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించాలని ఆదేశించింది . తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నీటి వివాదాల సమస్య పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









