వాయిదా పడిన 'జేమ్స్ బాండ్' చిత్రం
- June 26, 2015
అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం 'జేమ్స్ బాండ్'. 'నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కావాల్సివుంది. కానీ సాంకేతిక కారణాలవల్ల చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ... మా బ్యానర్‌లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్నందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయికిషోర్ అనుకున్నవిధంగా తెరకెక్కించారు. అల్లరి నరేష్ స్టయిల్ ఆఫ్ కామెడి ఉంటుంది. ప్రేక్షకులు నరేష్ చిత్రం ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడి ఎంటర్ టైనర్ మూవీ ఇది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తున్నాం' అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









