ఈ ఎమిరేట్‌లో జనవరి 1నుండి ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం
- October 05, 2023
యూఏఈ: జనవరి 1, 2024 నుండి రస్ అల్ ఖైమాలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ సంచులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఎమిరేట్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎప్డా) బుధవారం కొత్త చట్టాన్ని వివరించింది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై పాన్-యుఎఇ బ్లాంకెట్ బ్యాన్‌కు అనుగుణంగా వస్తుందని తెలిపింది. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పాలకుడు హిస్ హైనెస్ షేక్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి జారీ చేసిన 2023 చట్టం నెం.4 ప్రకారం ఈ ప్లాస్టిక్‌ల వినియాగాన్ని వచ్చే ఏడాది నుండి ఎమిరేట్‌లో నిషేధించబడతాయి. అబుదాబిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై నిషేధం జూన్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చింది.దుబాయ్‌లో జూలై 1, 2022 నుండి, షార్జా అక్టోబర్ 1, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లకు 25-ఫిల్ టారిఫ్‌ను ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







