ఏడాది చివరి వరకు చమురు ఉత్పత్తిలో స్వచ్ఛందంగా కోత: సౌదీ
- October 05, 2023
రియాద్: రోజుకి ఒక మిలియన్ బ్యారెల్ (బిపిడి) స్వచ్ఛంద ముడి చమురు ఉత్పత్తి కోతను 2023 సంవత్సరం చివరి వరకు పొడిగించినట్టు సౌదీ అరేబియా బుధవారం వెల్లడించింది. ఇంధన మంత్రిత్వ శాఖలోని అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ నెలలో మరియు సంవత్సరం చివరి వరకు ఒక మిలియన్ బిపిడి స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోతను కొనసాగిస్తుందని, వచ్చే నెలలో నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించనున్నట్లు ప్రకటించారు.నవంబర్ మరియు డిసెంబర్లలో కింగ్డమ్ ఉత్పత్తి సుమారుగా 9 మిలియన్ బిపిడి ఉంటుందని సౌదీ మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియా మొదట జూలైలో అదనపు స్వచ్ఛంద కోతను అమలు చేసింది. ఆ తర్వాత నెలవారీ ప్రాతిపదికన పొడిగిస్తూ వస్తుంది. OPECలోని కొంతమంది సభ్యులు 2024 చివరి వరకు ఇతర స్వచ్ఛంద క్రూడ్ అవుట్‌పుట్ క్షీణత రోజుకు 1.66 మిలియన్ బ్యారెల్స్‌కు తగ్గించాలని సూచించింది. ఇదిలా ఉండగా.. ఆగస్టులో రోజుకు 500,000 బ్యారెల్స్ , సెప్టెంబరులో రోజుకు 300,000 బ్యారెల్స్ ఎగుమతులను స్వచ్ఛందంగా తగ్గిస్తామని రష్యా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







