గన్‌మెన్ చెంప ఛెళ్లుమనిపించిన టి.హోంమంత్రి
- October 06, 2023
హైదరాబాద్: తెలంగాణ హోమ్ శాఖా మంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. తలసానికి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ ఆలీ…శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తరువాత అక్కడున్న సెక్యురిటీ గార్డ్ తలసానికి ఇచ్చేందుకు ఫ్లవర్ బొకే ఏది అని అడిగారు. ఈక్రమంలోనే అతను తెలీదని చెప్పినట్లుగా కనిపిస్తోంది. దీంతో సహనం కోల్పోయిన మహమూద్ ఆలీ… అగ్రహం వ్యక్తం చేస్తు అతని చెంప చెళ్లుమనిపించారు.
దీంతో అతను నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వెనుక ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. కాగా తెలంగాణ తొలి హోంమంత్రి తరువాత మహమూద్ ఆలీ తెలంగాణ రెండవ హోం మంత్రిగా నియమించబడిన విషయం తెలిసిందే.ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!