ఎయిర్ ఇండియా కొత్త విధానం..మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు
- October 07, 2023
యూఏఈ: ఎయిర్ ఇండియా కొత్త విధానం త్వరలో అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు కల్పించనున్నారు. దీంతో మహిళలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఎయిర్ ఇండియా మహిళా ఫ్లైయర్‌లు ప్రత్యేక సీట్లను ఎంచుకునేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఒంటరి మహిళా ప్రయాణికులు, తల్లులకు ప్రత్యేకంగా వారికి నచ్చిన విధంగా సీటింగ్ ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వనున్నారు. అదే సమయంలో ఖాళీగా సీట్లు ఉన్నట్లయితే, పురుషుల మధ్య కూర్చున్న ఒంటరి మహిళా ప్రయాణికులకు వేరే సీటును కేటాయించవచ్చు. క్యాబిన్ క్రూ సభ్యులు బేసినెట్ లొకేషన్ ఉన్న సీటును శిశువులతో ఉన్న తల్లులకు కేటాయించవచ్చు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







