సిక్కిం వరదల్లో అలనాటి తెలుగు నటి గల్లంతు
- October 07, 2023
న్యూఢిల్లీ: ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి ఇటీవలి సిక్కిం వరదల్లో గల్లంతైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత ధ్రువీకరించారు. అమ్మ ఆచూకీని గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న సరళ కుమారి అక్టోబర్ 2న స్నేహితులతో కలసి సిక్కిం పర్యటనకు వెళ్లినట్టు ఆమె కుమార్తె చెప్పారు. అక్కడ ఓ హోటల్ లో బస చేసినట్టు తెలిపారు.
చివరిగా ఈ నెల 3న అమ్మతో ఫోన్ లో మాట్లాడానని, ఆ తర్వాత అమ్మతో సమాచారం లేదంటూ నబిత వెల్లడించారు. ‘‘వరదలు వచ్చినట్టు వార్తలు చూసి తెలుసుకున్నాను. ఆర్మీ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసినప్పటికీ కలవడం లేదు’’ అని నబిత ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అమ్మ ఎక్కడ ఉందో ఆచూకీ కనుక్కోవాలని కోరారు. సరళ కుమారి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దాన వీర శూర కర్ణ’లో నటించారు. ‘సంఘర్షణ’ తదితర సినిమాల్లోనూ నటించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







