ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
- October 07, 2023
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం.. పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ మీద సుమారు 5000 రాకెట్లు ప్రయోగించబడ్డాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్ ప్రారంభించింది. హమాస్ దాడిలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మృతుల్లో షార్ హనెగెవ్ రీజియన్ మేయర్ కూడా ఉన్నారు. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడిలో మరణించిన వారి సంఖ్య ఐదుకి పెరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. గతంలో, గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడి అనంతరం హమాస్ యోధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.
గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ వైపు రాకెట్ ప్రయోగించారు. శనివారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లను ప్రయోగించారు. కుసేఫ్ నగరంలో రాకెట్ల వర్షం కురిసిందని, దీంతో అనేక మంది గాయపడ్డారని కుసేఫ్ మేయర్ అబ్ద్ అల్-అజీజ్ నసారా చెప్పారు. కుసేఫ్ దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఒక నగరం, ఇది గాజా స్ట్రిప్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. నివేదికల ప్రకారం.. ఇంతకుముందు రాకెట్ దాడిలో ఒక మహిళ మరణించించగా పలువురు గాయపడ్డారు. దాడి తర్వాత గాజా స్ట్రిప్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెల్ అవీవ్‌తో పాటు అలాగే దక్షిణాన ఉన్న సే బోకర్, అరద్, డిమోనలలో రెడ్ అలర్ట్ హెచ్చరిక సైరన్‌లు మోగాయి.
ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న నివాసితులు వరుస శబ్దాలు విన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిలో ఉందని ప్రతిపక్ష నేత కార్యాలయం నుంచి ఒక ప్రకటన పేర్కొంది. జెరూసలేం పోస్ట్ ప్రకారం, గాయపడిన వారిలో కొందరు కప్లాన్ ఆసుపత్రిలో చేరారు. ఇంతలో, దాడి తరువాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. జెరూసలేం పోస్ట్ ప్రకారం, గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి పెద్ద ఎత్తున రాకెట్ దాడులు జరిగాయి. హమాస్ యోధులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారు. దేశ దక్షిణ భాగం సహా మధ్య భాగంలో నివసించే ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టకుండా సురక్షిత ప్రదేశాలలో ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
గాజా స్ట్రిప్‌లో ప్రతీకార వైమానిక దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్‌లోకి హమాస్ రాకెట్ దాడి కారణంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా స్ట్రిప్ సరిహద్దు సమీపంలో రోడ్లను మూసివేసాయి. ఇజ్రాయెల్‌పై యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా హమాస్ తీవ్రమైన తప్పు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు. ఇజ్రాయెల్ సైనికులు అన్ని చొరబాటు ప్రదేశాలలో శత్రువులతో పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







