ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు.. దుబాయ్-మనీలా సర్వీసులపై ప్రభావం?

- October 07, 2023 , by Maagulf
ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు.. దుబాయ్-మనీలా సర్వీసులపై ప్రభావం?

యూఏఈ: బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలలో హై అలర్ట్‌ ప్రకటించారు.అయితే, దుబాయ్-మనీలా మధ్య విమానాలు యథాతధంగా నడిచాయని ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ రీజినల్ హెడ్-EMEA జోష్ వాస్క్వెజ్ తెలిపారు. దుబాయ్ నుండి మనీలా ఫ్లైట్‌తో సహా తమ విమాన షెడ్యూల్‌లలో ఎటువంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ ఫ్లాగ్ క్యారియర్లు దుబాయ్-మనీలా మధ్య రోజువారీ విమానాలను నడుపుతున్నాయి.

సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CAAP)కి వాణిజ్య విమానాలలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో వివిధ ఫిలిప్పీన్స్ విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. స్నిఫర్ డాగ్‌లను మోహరించారు. ఏవియేషన్ రెగ్యులేటర్ 42 వాణిజ్య విమానాశ్రయాలను హై అలెర్ట్ లో పెట్టాయి. విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన సెబు, బికోల్, దావో మరియు పలావాన్‌లకు వెళ్లే విమానాల్లో తక్షణ భద్రతా చర్యలను అమలు చేసినట్టు CAAP ప్రతినిధి ఎరిక్ అపోలోనియో వెల్లడించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com