యాంకర్ సుమ కుమారుడు హీరో అయిపోయాడోచ్.!

- October 07, 2023 , by Maagulf
యాంకర్ సుమ కుమారుడు హీరో అయిపోయాడోచ్.!

యాంకర్ సుమకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా తనదైన మాటల సునామీతో ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ పొందడమే కాదు.. సినీ ప్రముఖులందరిలోనూ సుమ కనకాలకు మంచి గుర్తింపు వుంది.

అందుకే తన కుమారుడి డెబ్యూ మూవీ పోస్టర్‌ని ఏకంగా టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అయిన రాజమౌళి చేతుల మీదుగా ఓపెన్ చేయించింది. అవునండీ.. సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘బబుల్ గమ్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. మానస హీరోయిన్‌గా నటిస్తోంది. టైటిల్‌తో పాటూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు తాజాగా రాజమౌళి. అక్టోబర్ 10న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ కానుందని ఈ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.

సుమ మంచి నటి. అందులో నో డౌట్. అలాగే రాజీవ్ కనకాల ఫ్యామిలీ కూడా నటనకు ప్రాణం పోసిన వారే.. ఇలాంటి ఓ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తున్న రోషన్ నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకుంటే అవకాశాలకు ఇండస్ర్టీలో కొదవే వుండదనడం అతిశయోక్తి కాదేమో.

సుమ కనకాల తలచుకుంటే, టాలీవుడ్ మోస్ట్ పాపులర్ డైరెక్టర్లు రోషన్‌తో సినిమాలు చేసేందుకు ఏమాత్రం తటపటాయించకుండా ముందుకొస్తారనొచ్చేమో. అయితే, అంతకన్నా ముందు రోషన్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com