శృతి హాసన్ ఆ హాలీవుడ్ సినిమా కోసం అంత చేసిందా.?
- October 07, 2023
అందాల భామ శృతి హాసన్‌ని త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో చూడబోతున్నామన్న సంగతి తెలిసిందే. ‘ది ఐ’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ సాహసోపేతమైన పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది.
అయితే, సాహసాలతో పాటూ, శృతి హాసన్ శృతి మించిన రొమాంటిక్ సన్నివేశాల్లోనూ కనిపించబోతోందట ఈ సినిమాలో. అసలే హాలీవుడ్ మూవీ. రొమాన్స్ డబుల్, ట్రిపుల్ రేంజ్‌లోనే వుంటుంది.
ఇక, శృతి హాసన్‌కీ అలాంటి సీన్లలో నటించకూడదన్న హద్దులేమీ లేవాయె. అందుకే హాలీవుడ్ హీరో మార్క్ రౌలీతో ఇంటిమేట్ సీన్లలో తెగ నటించేసిందట. బెడ్ రూమ్ సీన్లలో శృతి పండించిన హాట్ అప్పీల్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కానుందనీ అంటున్నారు.
అయితే, వన్స్ క్లిక్ అయ్యిందంటే చాలు.. శృతి హాసన్‌కి ఇంగ్లీష్‌లో ఇలాంటి అవకాశాలు పోటెత్తడం ఖాయం. అప్పట్లో ఈ తరహా ప్రచారంతోనే దేశీ బ్యూటీ ప్రియాంకా చోప్రా కూడా హాలీవుడ్‌లో అంత ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆ వంతు శృతి హాసన్‌ని వరించినట్లుంది. చూడాలి మరి, ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో.!
తాజా వార్తలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్









