డెంగ్యూ ఫీవర్ నుంచి దూరంగా వుండాలంటే.! ఈ చిన్న చిట్కాలు పాఠించి చూడండి.!

- October 07, 2023 , by Maagulf
డెంగ్యూ ఫీవర్ నుంచి దూరంగా వుండాలంటే.! ఈ చిన్న చిట్కాలు పాఠించి చూడండి.!

సీజన్ మార్పులో భాగంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయ్. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ అందర్నీ వణికిస్తోంది. దోమల ద్వారా వచ్చే డెంగ్యూ ఫీవర్ నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో వున్న చిన్న చిట్కాల ద్వారా ఒకింత ప్రయత్నం చేయొచ్చు.

తులసిలో అనేక ఔషధ గుణాలున్నాయ్. రోజూ కొన్ని తులసి ఆకుల్ని అటూ ఇటూ నమిలేస్తే చాలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.

అలాగే, తులసిని మిరియాలతో కలిపి రసంలా కానీ, లేదంటే టీలో పాలలో కానీ కలిపి తీసుకుంటే, డెంగ్యూ ఫీవర్‌ నుంచి తప్పించుకునే మార్గముంటుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా వుండడం వల్లే డెంగ్యూ సులువుగా వ్యాపిస్తుంది. ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. తులసిని తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తులసితో పాటూ, ఉసిరి కాయ రసం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. అలాగే తమలపాకుకీ రోగ నిరోధక శక్తిని పెంచే గుణం చాలా ఎక్కువ. పరగడుపునే ఒక తమలపాకును నమిలి మింగేస్తే మంచి ఫలితం వుంటుంది.

బొప్పాయిని మన డైట్ మెనూలో చేర్చుకోవడం చాలా ఉత్తమం. బొప్పాయిలోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేసి, తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచేందుకు తోడ్పడతాయ్. పచ్చి బొప్పాయితో కూర చేసుకోవచ్చు. పండు కాయను ఇష్టంగా తినేయొచ్చు. ఈ చిన్న చిట్కాలు, డెంగ్యూకి దూరంగా వుండడం లేదంటే, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు వుపయోగపడతాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com