ప్రభాస్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి..
- October 08, 2023
హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా ప్రభాస్ సినిమాల లైనప్ భారీగానే ఉంది. కానీ వీటి మధ్య ఓ మీడియం రేంజ్ మాములు కమర్షియల్ సినిమా చేయాలని డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలైనా రెండు షెడ్యూల్స్ అయిన తర్వాత షూట్ కి బ్రేక్ పడింది.
ఇక మారుతి ప్రభాస్ సినిమా షూట్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయి వైరల్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ లుక్ కొత్తగా ఉందని అభిమానులు కామెంట్స్ కూడా చేశారు. సలార్, కల్కి సినిమాల బిజీలో పడి మారుతి సినిమాకు గ్యాప్ ఇచ్చాడు. తాజాగా మారుతి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ అప్డేట్ ఇచ్చాడు.
మారుతి ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆల్రెడీ ప్రభాస్ అభిమానులు అనౌన్స్ చేసిన సినిమాలతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ సినిమా ఎప్పుడొస్తుందో, ఏ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూస్తున్నారు. ఇలాంటి టైంలో నా సినిమా గురించి కూడా చెప్పి వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేయను. నా లాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి స్టార్ డైరెక్టర్ తో చేసే ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ ని సరిగ్గా వాడుకుంటాను. ప్రభాస్ ని కొత్తగా చూపిస్తాను. అభిమానులకు నచ్చుతుంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. షూటింగ్ అయిన తర్వాత ఈ సినిమా అప్డేట్స్ ఇస్తాము అని తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రభాస్ మారుతి సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా మాళవిక మోహన్, నిధి అగర్వాల్ , రిధి కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









