రాహుల్ రవీంద్రన్ సినిమాలో రష్మికా మండన్నా.!
- October 09, 2023
రష్మిక మండన్నా అంటే పక్కా కమర్షియల్ హీరోయిన్. ఇంతవరకూ ఆమె చేసిన సినిమాలన్నీ కమర్షియల్ యాంగిల్‌లోనే ఆకట్టుకున్నాయ్. అయితే, ఇకపై రష్మిక డిఫరెంట్ పంథాలో ఆలోచిస్తోందనిపిస్తోంది.
కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ ఓకే చేస్తోంది. ఆ క్రమంలోనే డిఫరెంట్ కథాంశం వున్న ‘రెయిన్‌బో’ సినిమాని ఇప్పటికే ఓకే చేసి పెట్టింది రష్మికా మండన్నా.
దాంతో పాటూ, తాజాగా మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీ రష్మిక ముందుకొచ్చిందట. నటుడు కమ్ డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ ఓ సబ్జెక్ట్ తీసుకొచ్చాడట. ఆ సబ్జెక్ట్ రష్మికకు చాలా బాగా నచ్చేసిందట. దాంతో, నాన్ కమర్షియల్ అయినప్పటికీ ఆ సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయ్.
కాగా, గతంలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ‘మన్మధుడు 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ రిజల్ట్ అందుకున్న సంగతి తెలసిందే. ఆ తర్వాత ఆయన నుంచి సినిమాలు రాలేదు. కానీ, ఈ సబ్జెక్ట్ చాలా కొత్తగా వుండడంతో, అది కూడా రష్మిక వంటి స్టార్ హీరోయిన్‌ని ఒప్పించడంతో, ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయ్.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!