‘హాయ్ నాన్న’లో శృతి హాసన్ పాత్ర అదేనా.?

- October 09, 2023 , by Maagulf
‘హాయ్ నాన్న’లో శృతి హాసన్ పాత్ర అదేనా.?

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న తాజా మూవీ ‘హాయ్ నాన్న’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై పాజిటివ్ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోందన్న ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని నానికి జోడీగా చూపించలేదింతవరకూ. నానికి ఓ కూతురు వుంది కానీ, ఆమెకి తల్లి పాత్ర కాదు మృణాల్‌ది. అంటే, పాపకి తల్లిగా శృతి హాసన్ కనిపించబోతోందా.? శృతి హాసన్ పాత్రకి ఓ ప్లాష్ బ్యాక్ ఏదైనా వుండబోతోందా.? అని మాట్లాడుకుంటున్నారు.

ఏది ఏమైనా శృతి హాసన్ పాత్రను రిలీజ్ వరకూ సస్పెన్స్‌గానే వుంచుతారట. పాత్ర నిడివి చాలా చిన్నదిగా వుంటుందట. కానీ, ఆ పాత్రలోని డెప్త్ చాలా హృధ్యంగా వుండబోతోందనీ అంటున్నారు. 

అ అలాగే, శృతి హాసన్ ‘సలార్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటూ, ‘ది ఐ’ అనే ఇంగ్లీష్ మూవీలోనూ శృతి హాసన్ నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com