గ్లోబల్ విలేజ్ కు 4 బస్సు మార్గాలు.. Dh10 టికెట్ ధర

- October 11, 2023 , by Maagulf
గ్లోబల్ విలేజ్ కు 4 బస్సు మార్గాలు.. Dh10 టికెట్ ధర

యూఏఈ: 2023-24 సీజన్ కోసం గ్లోబల్ విలేజ్‌కు సందర్శకులకు చేరవేసేందుకు నాలుగు ప్రత్యేక బస్సు మార్గాలను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించనుంది.ఈ సేవలు అక్టోబరు 18న ప్రారంభం కానున్నాయి. గ్లోబల్ విలేజ్‌కి ఒక్క ట్రిప్ ధర 10 దిర్హామ్ గా నిర్ణయించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినోదం, షాపింగ్ అనుభవాలు, వంటకాలను గ్లోబల్ విలేజ్ అందిస్తుంది. యూఏఈ శీతాకాలంలో ప్రసిద్ధ గమ్యస్థానంగా గుర్తింపు పొందింది. ఇది 1997లో ప్రారంభం నుండి 100 మిలియన్లకు పైగా సందర్శకులను స్వాగతించింది.ఈ సీజన్‌లో ప్రవేశ టిక్కెట్ ధరలు Dh22.5 నుండి ప్రారంభమవుతాయి.

>> రూట్ 102: ప్రతి గంటకు రషీదియా బస్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది.

>> రూట్ 103: అల్ ఇత్తిహాద్ బస్ స్టేషన్ నుండి ప్రతి 40 నిమిషాలకు ఒక సర్వీస్ నడుస్తుంది.

>> రూట్ 104: అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి ప్రతి గంటకు ఒక సర్వీస్.

>> రూట్ 106: మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ బస్ స్టేషన్ నుండి ప్రతి గంటకు సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com