జర్మనీ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- October 13, 2023
బెర్లిన్: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ గురువారం ఉదయం జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని బెల్లేవ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో స్నేహపూర్వక ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అధ్యక్షుడు హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సంబంధాలపై సమీక్షించారు. తన ఈ పర్యటన అన్ని రంగాలలో సహకారానికి కొత్త అవకాశాలను తెరవడానికి దోహదపడుతుందని అమీర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలోప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. వీటితో పాటు రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సహకార సంబంధాలు, వివిధ స్థాయిలలో వాటిని అభివృద్ధి చేయడం, ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి , విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ, అమిరీ దివాన్ చీఫ్ షేక్ సౌద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-తానీ, ఇంధన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సాద్ బిన్ షెరిదా అల్ కాబీ హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







