సౌత్ డైరెక్టర్లపై మోజు పడుతోన్న నార్త్ మేకర్లు.!
- October 13, 2023
‘జవాన్’ సినిమాతో అట్లీ బాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు అట్లీ. అంతవరకూ ప్లాపుల్లో సతమతమవుతున్న షారూఖ్ ఖాన్‌కి ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం పండించింది ఈ సినిమా. దీంతో, ఇప్పుడు నార్త్ సినీ జనం దృష్టి సౌత్‌పై మేకర్లపై పడింది. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ త్వరలో తీయబోయే సినిమా కోసం ఓ సౌత్ డైరెక్టర్‌ని వేటాడే పనిలో వున్నాడట.
ఈ సినిమాని ఆయన సౌత్ హీరో అయిన విజయ్ దేవరకొండతో రూపొందించబోతున్నాడు. ‘లైగర్’ సినిమా టైమ్‌లోనే విజయ్ దేవరకొండతో కరణ్ జోహార్ ఇంకో సినిమాకి మాటిచ్చారు. ‘లైగర్’ ఫ్లాప్ అవ్వడం.. విజయ్ దేవరకొండ గ్యాప్ తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ కొలిక్కి రాలేదింతవరకూ.
ఇటీవలే ‘ఖుషి’ సినిమాతో విజయ్ దేవరకొండ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దాంతో, కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు కదిలారనీ తెలుస్తోంది. త్వరలోనే ఓ ప్రముఖ సౌత్ డైరెక్టర్‌తో ఈ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడనీ తెలుస్తోంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో విజయ్ దేవరకొండ బిజీగా వున్న సంగతి తెలిసిందే.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







