‘లియో’ బెనిఫిట్ షోస్.! విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.!
- October 13, 2023
ఇళయ దళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘లియో’. విజయ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. సీనియర్ నటుడు అర్జున్ ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ స్టన్నింగ్ రోల్ పోషిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్లో కనిపిస్తున్నారు.
రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌తోనే విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారనుకుంటుండగా.. తమిళనాడు ప్రభుత్వం ఫ్యాన్స్ కోసం మరో ఖుషీ న్యూస్ రివీల్ చేసింది.
ఈ సినిమాకి బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 19న సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. 19 ఉదయం 4 గంటల నుంచి రెండు బెనిఫిట్ షోస్‌కి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
అలాగే, 20 నుంచి 24 వరకూ ఉదయం ఒక ఎక్స్ట్రా షో ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతిచ్చింది. దాంతో, విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగి తేలుతున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకను అనివార్య కారణాలతో ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రచ్చ చేశారు. అయితే, బెనిఫిట్ షోలకు అనుమతిచ్చి ఫ్యాన్స్ మెప్పు పొందింది తమిళనాడు గవర్నమెంట్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







