‘గేమ్ ఛేంజర్’ని కూడా రెండు ముక్కలు చేస్తారా.?
- October 13, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ని కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత రామ్ చరణ్, ఎన్టీయార్‌లు గ్లోబర్ స్టార్స్ అయిపోయారు.
ఆ సినిమా తర్వాత వారి నుంచి వచ్చే సినిమాల పైనా ఆ స్థాయి అంచనాలు నెలకొన్నాయ్. ఆ క్రమంలోనే ఎన్టీయార్ సినిమా ‘దేవర’ను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నామంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
ఇక, ఇప్పుడు రామ్ చరణ్ వంతు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’నీ అదే మాదిరి రెండు పార్టులుగా డివైడ్ చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్.
అయితే అలాంటిదేం లేదంటూ, చిత్ర యూనిట్ చెబుతోంది. నిప్పు లేనిదే పొగరాదంటారు కదా.. ఇప్పుడు కాదన్నా.. ఆ తర్వాత ఈ గాసిప్ నిజం కాకపోతుందనడానికి లేదు. రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు ఈ సినిమాలో.
అంజలి, కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, పలు భాషల నుంచి పలువురు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







