అఖిల్ అలా డిసైడ్ అయ్యాడట.!
- October 13, 2023
కమర్షియల్ సినిమాలతో చాలానే ప్రయత్నాలు చేశాడు అక్కినేని అందగాడు అకిల్ ఇంతవరకూ. కానీ, ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఆఖరికి సురేందర్ రెడ్డి వంటి స్టార్ సీనియర్ దర్శకుడు కూడా అఖిల్‌కి ఓ సూపర్ హిట్ ఇవ్వలేకపోయాడు.
భారీ అంచనాలతో రూపొందిన ‘ఏజెంట్’ బొక్క బోర్లా పడింది. ఆఖరికి ఓటీటీకి కూడా నోచుకోలేదింతవరకూ అఖిల్ ‘ఏజెంట్’ మూవీ. ఇదిలా వుంటే, అఖిల్ తాజాగా ఓ థ్రిల్లర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘విరూపాక్ష’తో హిట్ కొట్టిన కార్తీక్ దండు ఓ థ్రిల్లర్ కథాంశాన్ని అఖిల్ కోసం ప్రపోజ్ చేశాడట. నాగార్జున సైతం ఈ కథపై సుముఖంగా వుండేసరికి.. అఖిల్‌తో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా వున్నాడట కార్తీక్ దండు.
ఈ సినిమాలో ఓ కొత్త భామను హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ సమాచారం. దసరా సందర్భంగా అధికారిక ప్రకటన ఇవ్వడంతో పాటూ, సినిమాని లాంఛనంగా స్టార్ట్ చేయబోతున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ థ్రిల్లర్ అయినా అఖిల్‌ని ఆదుకుంటుందేమో.!
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









