సహజ సిద్ధమైన చిట్కాల ద్వారా బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చా.?

- October 13, 2023 , by Maagulf
సహజ సిద్ధమైన చిట్కాల ద్వారా బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చా.?

అధిక రక్తపోటు కారణంగా గుండె జబ్బు ప్రమాదం పొంచి వుంటుంది. అయితే, జీవన శైలిలో చిన్న చిన్న సహజ సిద్ధమైన మార్పుల కారణంగా అధిక రక్తపోటును నియంత్రణలో వుంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  ఏంటా మార్పులు ఇప్పుడు తెలుసుకుందాం.

హృదయ నాళ వ్యవస్థ బలంగా తయారవ్వాలంటే, ప్రతీ రోజూ నడక తప్పని సరి. స్పీడ్ వాక్ కాకుండా, స్లోగా వాకింగ్ చేయడం తప్పని సరి. రోజూ కాకపోయినా, వారంలో రెండు సార్లు కానీ, మూడు సార్లు కానీ మెడిటేషన్ లేదా ధ్యానం చేస్తే మంచి ఫలితం వుంటుంది.

అలాగే, ఆహారంలో ఉప్పును తగ్గించి తీసుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అధిక మసాలా వంటకాలకు కాస్త దూరంగా వుండాలి. మెనూలో ఆకుకూరలను, తాజా పండ్లను ఖచ్చితంగా చేర్చుకోవాలి.

అధిక రక్తపోటు వున్న వాళ్లు ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్లకు దూరంగా వుండాలి. పొగాకు రక్త నాళాల గోడల్ని ధృడంగా చేస్తుంది. తద్వారా రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడుతుంది.

అదే హృదయ నాళాల్లో బ్లాక్స్ ఏర్పడడానికి కారణం అవుతుంది. అలాగే మధ్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కణ జాలాలు దెబ్బ తింటాయ్.

ఈ మార్పులు చేసుకోవడం కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. చాలా సులువుగా ఈ మార్పులు చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com