తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల..
- October 15, 2023
హైదరాబాద్: తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఈ మేరకు మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేయాల్సి ఉండగా.. ఉదయం 9:05 గంటలకు విడుదల చేశారు. మొత్తం 55 మంది అభ్యర్థుల జాబితాతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. వివాదం లేని స్థానాలను తొలుత ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థులను సైతం ఖరారు చేయనున్నది. ఫస్ట్ లిస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ఉండగా.. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







