ఇజ్రాయెల్ నుంచి భారత్ కు చేరుకున్న నాల్గో విమానం..
- October 15, 2023
న్యూ ఢిల్లీ: ఆపరేషన్ అజయ్ లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి మరో విమానం భారత్ కు చేరుకుంది. 274 మంది భారతీయ ప్రయాణికులతో ఇజ్రాయెల్ నుంచి నాల్గో విమానం ఆదివారం దేశ రాజధానిలో ల్యాండ్ అయింది.
కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ విమానాశ్రయంలో భారతీయ ప్రయాణికులకు స్వాగతం పలికారు. అతను వారితో మాట్లాడారు. ప్రతి భారతీయ ప్రయాణీకుడికి త్రివర్ణ పతాకాలను కూడా అందించారు. ఇజ్రాయెల్‌లో పరిస్థితుల మధ్య భారతీయ పౌరులను తరలించడానికి మరిన్ని విమానాలను వినియోగిస్తామని రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు.
"ఇది 4వ విమానం. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న యుద్ధంతో తమ దేశ ప్రజలు అక్కడ అనవసరంగా భారంగా మారకూడదని.. ఇంటికి తిరిగి రావాలని చూస్తున్న్నారని" అని సింగ్ చెప్పారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, సూచనలను పాటించాలని, సోమవారం మరో విమానం రానుందని ఆయన తెలిపారు. "రేపు మరో ఫ్లైట్ వస్తోంది. రిజిస్టర్ చేసుకున్న వారందరినీ బయటకు తీసే వరకు మేము విమానాలను నడుపుతూనే ఉంటాము. ఈ ఆపరేషన్ చాలా బాగా జరుగుతోంది. భయపడాల్సిన అవసరం లేదు" అని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, 'ఆపరేషన్ అజయ్' నిర్వహించి భారతీయ పౌరులను తరలించినందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భారతీయ ప్రయాణికులు తెలిపారు. భారతీయ పౌరులు ఈ ఆపరేషన్‌ను ప్రశంసించారు. భారత రాయబార కార్యాలయం నుంచి మద్దతు ఉందని, తరలింపు ప్రక్రియ చక్కగా, త్వరగా జరిగిందని చెప్పారు. ఆపరేషన్ అజయ్ లో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. రెండో విమానం శనివారం ఉదయం ఇండియాకు చేరుకుంది.
రెండో విమానంలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 235 మంది భారతీయులు వచ్చారు. ఢిల్లీకి వచ్చిన 274 మంది భారతీయ ప్రయాణీకులలో పది మంది ఉత్తరాఖండ్ పౌరులు కూడా ఉన్నారు. వారిని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రతినిధి విమానాశ్రయంలో కలిశారు. "నాది ఉత్తరాఖండ్ అని.. నేను నా కుమార్తెను కలవడానికి ఇజ్రాయెల్ వెళ్ళాను, కానీ బాంబు దాడి ప్రారంభమైన తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను. నేను రాయబార కార్యాలయాన్ని సంప్రదించాను. వారు అవసరమైన అన్ని సహాయం" పుష్పా సింగ్ అనే సీనియర్ మహిళ చెప్పారు.
ఇజ్రాయెల్‌లోని దాదాపు 18,000 మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోడీ 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించారు. భారతీయుల నమోదు గురువారం ప్రారంభమైంది. హమాస్ టెర్రరిస్టుల అలలు సరిహద్దును అతిక్రమించడంతో 1,300 మందికి పైగా ఇజ్రాయెల్‌లు మరణించారు
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







