గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్ పై ఇజ్రాయెల్ బాంబు దాడి..500 మంది మృతి
- October 18, 2023
గాజా: గత కొద్దీ రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య భారీ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని ఆసుపత్రి పై వైమానిక దాడి చేయడంతో దాదాపు 500 మంది మృతి చెందారు. ఈ దాడిని ఇజ్రాయెల్ జరిపిన మారణహోమంగా హమాస్ అభివర్ణించింది. ఈ దాడిలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ ఖండించింది. హమాస్ రాకెట్ మిస్ ఫైర్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇజ్రాయెల్ పేర్కొంది.
సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడి చేసిందని హమాస్ పేర్కొంది. ఈ ఆసుపత్రిని గాజా స్ట్రిప్‌లోని చివరి క్రైస్తవ ఆసుపత్రిగా అభివర్ణిస్తున్నారు. అల్ అహ్లీ అబ్రి బాప్టిస్ట్ హాస్పిటల్‌పై సాయంత్రం ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని, ఇందులో 500 మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరిగిన గొడవల్లో, దాడుల్లో ఇదే పెద్దది. ఇక ఉత్తర గాజాలో దాడులు చేస్తాం…అక్కడ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని చెప్పిన ఇజ్రాయెల్ దక్షిణ గాజాలో కూడా దాడులు చేస్తోంది. నిన్న జరిగిన దాడుల్లో దక్షిణ గాజాలో పదుల సంఖ్యలో పాలస్తీనావాసులు మరణించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







