నేడు ఐదోరోజు అట్ల బతుకమ్మ.. ప్రత్యేకతలు ఇవే!!

- October 18, 2023 , by Maagulf
నేడు ఐదోరోజు అట్ల బతుకమ్మ.. ప్రత్యేకతలు ఇవే!!

బతుకమ్మ.. ఈ పేరు చెబితేనే గుర్తొస్తుంది తెలంగాణ సాంస్కృతిక వైభవం. మానవ జీవితానికి ప్రకృతితో పెనవేసుకున్న బంధం. సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ రాష్ట్ర ఉత్సవం బతుకమ్మ. ప్రతి సంవత్సరం తెలంగాణ సాంప్రదాయాలకు చిహ్నంగా ఉన్న బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలు ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

తొమ్మిది రోజులపాటు జరుగుతున్న బతుకమ్మ వేడుకలలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను మహిళలు పూజిస్తున్నారు.ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పించి అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు. తాము సౌభాగ్యవతులుగా జీవించాలని, పాడిపంటలతో, పిల్లా జెల్లలతో సంతోషంగా జీవించాలని పూజలు చేస్తున్నారు.

తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ గా ప్రారంభించిన బతుకమ్మ ఉత్సవాలు, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మగా వైభవంగా నిర్వహించారు. ఇక నేడు 5వ రోజు అట్ల బతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఐదవ రోజు అట్ల బతుకమ్మ లో భాగంగా ఉప్పుడు బియ్యంతో చేసిన అట్లు, దోశలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు . ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అట్ల బతుకమ్మను నిర్వహిస్తారు. బియ్యాన్ని నానబెట్టి దంచి చేసిన అట్లను గౌరమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు. బియ్యం పిండి అట్లను అమ్మవారికి నివేదించి, అట్లనే ఆడపడుచులకు వాయనంగా అందిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ నాడు తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి పూలను అందంగా పేర్చి అందమైన బతుకమ్ఇమలను తయారు చేస్కతారు. ఐదవ రోజు 5 ఎత్తులలో మహిళలు బతుకమ్మను పేరుస్తారు. మహిళలు అందరూ వేడుకగా అట్ల బతుకమ్మను జరుపుకుంటారు.ఇలా మొత్తం 9 రోజుల పాటు మహిళలు ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ వేడుకలు జరుగుతాయి.తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో బతుకమ్మకు వీడ్కోలు చెప్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com