ఆ క్రేజీ కామెడీ హీరోని ఆడియన్స్ మర్చిపోయారా ఏంటీ.?
- October 18, 2023
‘హృదయ కాలేయం’. ‘కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో తనదైన స్పూఫ్ కామెడీ చేసి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటూ, సంచలనాలు సృష్టించిన హీరో సంపూర్ణేష్ బాబు.
సంపూర్ణేష్ బాబు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా చాలా మనసున్న వ్యక్తి. అందుకేనేమో, స్వతహాగానే ఆయనను అభిమానించే వాళ్లు చాలా మంది వున్నారు.
ధియేటర్లలో ఆయన సినిమాలకు చప్పట్లు, విజిల్స్‌తో పాటూ, తన మార్కెట్‌కి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కూడా బాగానే పండేది. అయితే, ఈ మధ్య సంపూర్ణేష్ సినిమాలకు కాస్త దూరంగా వుంటున్నారు.
తాజాగా ఆయన ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదో డిఫరెంట్ కామెడీ సినిమా. తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీకి తెలుగు రీమేక్ ఈ చిత్రం.
ఈ సినిమాని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సంపూర్ణేష్ బాబు. అయితే, సంపూర్ణేష్ బాబు సినిమాలకు ప్రీ రిలీజ్ హంగామా చాలా చాలా ఎక్కువగా వుంటుంది. కానీ ఈ సినిమా విషయంలో ఆ స్థాయి హడావిడి కనిపించడం లేదు. అక్కడికే పెయిడ్ ప్రమోషన్లు ఆల్రెడీ షురూ చేశారు. కానీ, ఎందుకో బజ్ క్రియేట్ కావడం లేదు. యోగిబాబు సినిమాలకు తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఫాలోయింగ్ వుంది. అతని కామెడీ స్టైలింగ్ అలాంటిది.
ఆయన సినిమాని రీమేక్ చేస్తున్న మన సంపూర్ణేష్ బాబు ఏం తక్కువ.. ఈయన అంతకన్నా ఎక్కువ. చూడాలి మరి, ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో.!
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు