‘టైగర్’ మ్యాజిక్ అంతలా వుందా.?
- October 18, 2023
మాస్ మహరాజా రవతేజ ‘ధమాకా’ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత వెంటనే ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ఇంకో హిట్ కొట్టేశాడు. దాంతో రవితేజలో హుషారు మరిన్ని రెట్లయ్యింది. వరుసగా కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడంతో పాటూ, సైమల్టేనియస్‌గా వాటిని పూర్తి చేస్తూ వస్తున్నాడు.
అందులో భాగంగానే ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది. ఈ శుక్రవారం సినిమా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. బయోపిక్ కావడంతో ఈ సినిమాపై కొన్ని అంచనాలున్నాయ్. ట్రైలర్‌కి మంచి రెస్సాన్స్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాలు వేరే లెవల్‌లో వుంటాయని ప్రచారం జరుగుతోంది.
అలాగే, ‘టైగర్ నాగేశ్వరరావు’ బిజినెస్ కూడా బాగా జరిగిందని అంటున్నారు. అది ఇంతవరకూ రవితేజ కెరీర్‌లో జరగని బిజినెస్ అంటున్నారు. దాదాపు 40 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటేనే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇక, ఈ సినిమాతో రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. ఆమె పాత్ర సర్‌ప్రైజింగ్‌గా వుండబోతోందట. అలాగే, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ వంటి హీరోయిన్లు మరో స్పెషల్ ఎలిమెంట్స్ ‘టైగర్ నాగేశ్వరరావు’కి. చూడాలి మరి, ఈ సారి మాస్ రాజా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







