సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ
- October 20, 2023
న్యూఢిల్లీ: ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దంటూ తెలంగాణ అధికార పక్షం బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు కారు గుర్తును పోలి ఉన్నాయని, దీని వల్ల ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతోందని అదివరకే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన బిఆర్ఎస్ పార్టీ… అదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి ఎన్నికల గుర్తులను ఎవరికీ కేటాయించకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
బిఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించింది. సాధారణ ఎన్నికల గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా, ఓటర్లేమీ రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కారు గుర్తుకు తేడా తెలుసుకోలేనంత అమాయకులేమీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







