ఇండియాలో మాజీ బహ్రెయినీ నివాసి హత్య
- May 22, 2016
ఇండియాలోని బెంగళూరులో మాజీ బహ్రెయినీ నివాసితురాలు కిరణ్ సింగ్ హత్య పట్ల ఆమె మాజీ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గల్ఫ్ ఎయిర్లో క్యాబిన్ క్రూగా 1980లలో కిరణ్ సింగ్ పనిచేశారు. 1983 నుంచి 1988 వరకు కలిసి పనిచేశామని హమీద్ కరిమి, కిరణ్ సింగ్తో తన సాన్నిహిత్యం గురించి చెప్పారు. ఆమె ఎప్పుడూ సరదాగా ఉండేవారని వివరించారు హమీద్ కరిమి. భర్త నుంచి విడాకులు తీసుకున్న కిరణ్ సింగ్ ఢిల్లీ నుంచి బెంగళూరుకి మకాం మార్చారు. అక్కడే ఐదేళ్ళుగా ఆమె నివసిస్తున్నారు. కిచెన్లో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందడాన్ని ఆమె ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి దొంగతనం జరిగిన ఆనవాళ్ళు లేకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. వాట్సాప్ మెసేజ్లు, ఆమె ఫోన్లో కాల్ డేటా వంటివాటిపై దృష్టిపెట్టిన పోలీసులు, హత్యకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







