భవనం పైనుంచి పడి 5 ఏళ్ళ బాలిక మృతి
- May 22, 2016
ఐదేళ్ళ బాలిక ఓ అపార్ట్మెంట్లోని ఎనిమిదవ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిన ఘటన దుబాయ్లో చోటుచేసుకుంది. గ్రీన్స్ కమ్యూనిటీ ఎదురుగా ఉన్న టెకామ్ నూర్ 1లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ పోలీస్ చీఫ్ అసిస్టెంట్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరి మాట్లాడుతూ భారతదేశానికి చెందిన ఆ బాలిక, కిటికీలోంచి కిందికి తొంగి చూస్తూ కిందికి పడిపోయినట్లు చెప్పారు. మృతురాలితోపాటు ఆమె సోదరి రూమ్లో నిద్రపోతున్నారనీ, మెలుకవ రావడంతో ఐదేళ్ళ చిన్నారి, కుటుంబ సభ్యుల కోసం చూస్తూ, కిందకి పడిపోయిందని అన్నారు. 2015లో షార్జా, తల్లిదండ్రులకు నిర్లక్ష్యంపై వార్నింగ్ ఇచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలనీ, లేనిపక్షంలో వారిపైనా కేసులు నమోదు చేయాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణమవుతుండడం బాధాకరమని అపార్ట్మెంట్ వాసులు, ఇతరులు అభిప్రాయపడ్డారు. అలాగే బాల్కనీ రైలింగ్స్ ఎత్తు పెంచాలనీ, కిటికీలకు గ్రిల్స్ తప్పనిసరిగా ఉండాలనే సూచనలూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







