గాజాలో మానవతా కారిడార్ల కోసం UN సెక్రటరీ జనరల్ తో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్
- October 21, 2023
రియాద్: గాజా పౌరుల కోసం మానవతా కారిడార్లను ఏర్పాటు చేయడంలో UN కీలక పాత్ర పోషించాలని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ కోరారు. ఈ మేరకు UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో ఫోన్ కాల్లో మాట్లాడారు. గాజాలో కొనసాగుతున్న సైనిక తీవ్రతపై ఈ సందర్భంగా చర్చించారు. సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి, తీవ్రతను తగ్గించడానికి అంతర్జాతీయ -ప్రాంతీయ ప్రయత్నాలను తీవ్రతరం చేయవలసిన అవసరాన్ని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. క్రౌన్ ప్రిన్స్ ప్రాంతీయ, ప్రపంచ భద్రతపై సంభావ్య ప్రమాదకరమైన పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి ప్రక్రియను పునరుద్ధరించడం ఆవశ్యకతను వివరించారు. పాలస్తీనా ప్రజలు చట్టబద్ధమైన హక్కులను పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు క్రౌన్ ప్రిన్స్ గాజాలో ముట్టడిని ఎదుర్కొంటున్న పౌరులకు అవసరమైన వైద్య సంరక్షణ, ఆహారాన్ని అందించడానికి సురక్షితమైన మానవతా కారిడార్లను అందించడంలో UN మరియు దాని సంస్థల కీలక పాత్ర పోషించాలని కోరారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







