హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావు
- October 21, 2023
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్ రావు ఎన్నికయ్యారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆయన విజయం సాధించారు. దీంతో ప్రత్యర్థి ప్యానల్‌కు చెందిన అమర్‌నాథ్ రీకౌంటింగ్ కోరారు. కాగా.. క్రికెట్ ఫస్ట్ ప్యానల్‌కి చెందిన సునీల్ అగర్వాల్ హెచ్‌సీఏ కౌన్సిలర్‌గా విజయం సాధించారు.
ఈ ప్యానల్‌కు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ మద్దతిచ్చారు. కాగా ప్యానల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కి చెందిన అన్సార్ అలీకి 47 ఓట్లు పడగా సునీల్ అగర్వాల్‌కి 59 ఓట్లుపడ్డాయి. దీంతో సునీల్ అగర్వాల్ 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా దల్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానల్, సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానల్), ట్రెజరర్‌గా సీజే శ్రీనివాస్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానల్) విజయం సాధించారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







