GCC-ASEAN సమ్మిట్: గాజా కాల్పుల విరమణకు పిలుపు

- October 21, 2023 , by Maagulf
GCC-ASEAN సమ్మిట్: గాజా కాల్పుల విరమణకు పిలుపు

రియాద్: జిసిసి దేశాలు,  ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న నాయకులు గాజాలో పరిణామాల పట్ల తమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. పౌరులపై జరిగిన అన్ని దాడులను ఖండించారు. శాశ్వత కాల్పుల విరమణను ఏర్పాటు చేయాలని అన్ని సంబంధిత పార్టీలకు పిలుపునిచ్చింది. మానవతా సహాయం, సహాయ సామాగ్రి మరియు ఇతర నిత్యావసరాలు మరియు ప్రాథమిక సేవలను పునరుద్ధరించాలని చెప్పింది. ముఖ్యంగా విద్యుత్, నీటి పునరుద్ధరణ, అలాగే గాజా అంతటా ఇంధనం, ఆహారం మరియు ఔషధాల కోసం అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. పౌరులను రక్షించాలని, అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని, ముఖ్యంగా ఆగస్ట్ 12, 1949 నాటి యుద్ధ సమయంలో పౌర వ్యక్తుల రక్షణపై జెనీవా కన్వెన్షన్ సూత్రాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలని అన్ని పార్టీలను కోరారు. పౌర బందీలు, ఖైదీలను, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, రోగులు మరియు వృద్ధుల తక్షణ మరియు షరతులు లేకుండా విడుదల చేయాలని సూచించింది.  ఈజిప్ట్ మరియు జోర్డాన్‌ల సహకారంతో మధ్యప్రాచ్యంలో శాంతి ప్రక్రియను పునరుద్ధరించడానికి, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ చొరవ తీసుకోవాలని సమ్మిట్ లో పాల్గొన్న నాయకులు కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com