రియాద్ సీజన్ టెన్నిస్ కప్.. స్టార్-స్టడెడ్ లైనప్‌ ఆవిష్కరణ

- October 22, 2023 , by Maagulf
రియాద్ సీజన్ టెన్నిస్ కప్.. స్టార్-స్టడెడ్ లైనప్‌ ఆవిష్కరణ

రియాద్: గ్లోబల్ టెన్నిస్ రియాద్ సీజన్ టెన్నిస్ కప్‌ను సౌదీ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. రియాద్ సీజన్ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 26 నుండి 27 వరకు ఈ టోర్నమెంట్ జరుగనుంది. సెర్బియా మాస్ట్రో నోవాక్ జొకోవిచ్ ఇందులో పాల్గొంటున్నారు. అతడితోపాటు స్పానిష్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ప్రేక్షకులను అలరించనున్నారు. మహిళల విభాగంలో ప్రపంచంలోని నం. 1-ర్యాంక్ క్రీడాకారిణి బెలారసియన్ పవర్‌హౌస్ అరీనా సబాలెంకా, ఏడో ర్యాంక్‌లో ఉన్న ట్యునీషియా టెన్నిస్ సంచలనం ఒన్స్ జబీర్ సౌదీ పాల్గొంటున్నారు.  రియాద్ సీజన్ టెన్నిస్ కప్ ఎలైట్ టెన్నిస్ సర్క్యూట్‌లోని ప్రధాన టోర్నమెంట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com