ETCA వారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- October 23, 2023 , by Maagulf
ETCA వారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దుబాయ్: దుబాయ్ లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA)  ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు దుబాయ్ లోని ఆల్ అహ్లి  స్పోర్ట్స్ క్లబ్   ఇన్డోర్ స్టేడియంలో నిర్వహించిన  బతుకమ్మ పండుగ ఉత్సవాలు  అంబరాన్ని అంటాయి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ 2011 నుండి క్రమం తప్పకుండ  నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడ 13 వ సారి  ఘనంగా  బతుకమ్మ పండుగను నిర్వహించారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిస్ హైనెస్ షేక్ అలీ అల్ ముక్తుమ్ హాజరు అయ్యారు, యూఏఈ మరియు భారత దేశ జాతీయ గీతాలతో ప్రాగణంలో హాజరైన వారంత గౌరవ వందనం చేసారు. అనంతరం షేక్ కు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను ETCA మహిళ సభ్యులు తెలియచేసారు , బతుకమ్మల దగ్గరికి వచ్చి షేక్ మహిళలను అభినందించారు, కార్యక్రమానికి హాజరయిన ప్రతి ఒక్కరిని ఉత్సహపరుస్తూ చేతి ఎత్తి అభివాదం చేశారు , అనంతరం షేక్ ను నిర్వాహక సభ్యులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. 

కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా జానపద గాయని వాణి వొల్లలా , సింగర్ శ్రీనిధి, హోస్టుగా సోని పటేల్ నిలిచారు, దుబాయ్ లోని అల్ అహ్లి స్పోర్ట్స్ క్లబ్ జరిగిన ఈ వేడుకలకు సుమారు 3000 పైగ మంది తెలంగాణ ప్రవాసీయులు పాల్గొన్నారు.ఈ వేడుకల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటల, కోలాటాల నృత్యాల నడుమ   వేడుక ప్రాంగణం పులకించింది.రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడపడుచు ల పాటలు మరియు చప్పట్లతో  మారుమోగింది సప్తవర్ణల శోబితమైన పులదొంతరుల బతుకమ్మలు చూడముచ్చటగా నిలిచాయి ,ఉదయం నుండే ఆడపడుచుల వాటిని ఎంతో అందంగా అలంకరించి రంగు రంగు పూలతో తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకొన్నాయి , అందమైన బతుకమ్మల పోటీ , బాలికల కోసం సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేయటం జరిగింది, హాజరయిన వారందరికీ బతుకమ్మ ప్రసాదం, స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకలు పీచర కిరణ్ కుమార్, అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్ష్యులు జగదీశ్ రావు, కార్యదర్శి వినోద్ ఆచార్యులు, మాజీ అధ్యక్ష్యుడు రాధారపు సత్యం, కోర్ సభ్యులు ఎస్ పి కస్తూరి , తిరుమల్  రావు బీరెల్లి, శేఖర్ గౌడ్ గుండవేని, చైతన్య చకినం, రఘు ఎలిగేటి , సురేష్ రెడ్డి, శ్రీనివాస్ ఎలిగేటి, సరోజ , రాణి , మౌనిక , అన్నపూర్ణ,  సంఘ కార్య వర్గ సభ్యులు, వివిధ ప్రవాసీ కుటుంబాలతో పాటు, తెలుగు రాష్ట్రాల చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com