ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఖురాన్ అవార్డు నాల్గవ ఎడిషన్ ప్రకటన
- October 24, 2023
బహ్రెయిన్ : దివంగత హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఖురాన్ అవార్డ్ నాల్గవ ఎడిషన్‌ను అల్ నూర్ ఛారిటీ వెల్ఫేర్, అల్ నూర్ ఛారిటీ వెల్ఫేర్ గౌరవ చైర్పర్సన్ షేఖా లుల్వా బింట్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ప్రకటించారు. అల్ నూర్ ఛారిటీ వెల్ఫేర్ ఛైర్పర్సన్, అవార్డు పర్మనెంట్ కమిటీ హెడ్ షైఖా లామియా బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా.. అవార్డు గత ఎడిషన్ల విజయాన్ని మరియు ప్రజల డిమాండ్‌ను వెల్లడించారు. అవార్డు నాలుగు విభాగాలలో అందజేయిస్తామని తెలిపారు. మొదటిది బహ్రెయిన్లు మరియు నివాసితుల కోసం వారి వయస్సుతో సంబంధం లేకుండా మొత్తం పవిత్ర ఖురాన్ (సూరా అల్-బఖరా నుండి సూరా అన్-నాస్ వరకు) కంఠస్థం చేయడం.. రెండవది ఖురాన్‌లోని పది భాగాలను (సూరా అల్-అంకాబుట్ నుండి సూరా అన్-నాస్ వరకు) బహ్రెయిన్‌లకు వారి వయస్సుతో సంబంధం లేకుండా కంఠస్థం చేయడం.. మూడవ కేటగిరి ఖురాన్లో పదవ వంతు (సూరా అల్-ముజాదిలా నుండి సూరా అన్-నాస్ వరకు) 15 సంవత్సరాల వయస్సు గల బహ్రెయిన్ల కోసం కంఠస్థం చేయడం, నాల్గవ కేటగిరిలో బరామ్ అల్-ఖురాన్ (పిల్లలు) కోసం ఖురాన్‌లోని అమ్మ భాగాన్ని కంఠస్థం చేయడం. ఖురాన్ యొక్క) 10 సంవత్సరాల వరకు బహ్రెయిన్‌లకు వర్తిస్తుందని తెలిపారు. వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 7 వరకు పేర్లని నమోదు చేసుకోవాలని, పోటీ జనవరి 2024 చివరి వారంలో ప్రారంభమవుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!







