అల్పపీడనంగా తేజ్...ఈ వారంలో భారీ వర్షాలు, వడగళ్ళు
- October 24, 2023
యూఏఈ: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను క్రమంగా బలహీనపడి ఉష్ణమండల తుఫానుగా మారి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని యూఏఈ వాతావరణ విభాగం తెలిపింది. తేజ్ తుఫాను గురించి తాజా అప్డేట్లో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ప్రస్తుతం కేటగిరీ 2 తుఫానులో గాలి వేగం 165kmph వరకు ఉందని తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడనుంది. బుధ, శుక్రవారాల్లో కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములు, వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఎన్‌సిఎం అంచనా వేసింది.రస్ అల్ ఖైమా ,ఖోర్ ఫక్కన్లలో భారీ వర్షాలు మరియు వడగళ్ల వానలు కురుస్తున్నందున వరదలతో నిండిన లోయలను చూపించే వీడియోలను వాతావరణ విభాగం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







