గాజా సోషల్ మీడియా పోస్ట్.. అరబ్ ఇజ్రాయెల్ నటి అరెస్ట్
- October 25, 2023
యూఏఈ: ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి గురించి సోషల్ మీడియా పోస్ట్‌పై "ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం" అనే అనుమానంతో ప్రముఖ అరబ్ ఇజ్రాయెలీ నటిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మతెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన నజరేత్‌లో నివసిస్తున్న మైసా అబ్దెల్ హదీని సోమవారం అరెస్టు చేయగా.. గురువారం వరకు కస్టడీ విధించారు. యుద్ధాన్ని చర్చిస్తూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌లు పెట్టడం దీనికి కారణం. అక్టోబరు 7న ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ జరిపిన దాడిలో గాజా స్ట్రిప్ మరియు ఇజ్రాయెల్ మధ్య కంచెను బద్దలు కొట్టిన బుల్డోజర్ చిత్రాన్ని హదీ పోస్ట్ చేసింది. 1989 వరకు జర్మనీని విభజించిన బెర్లిన్ గోడ పతనానికి సూచనగా "లెట్స్ గో బెర్లిన్-శైలి" అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చింది. ఆమె తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించబడిందని మానవ హక్కుల సంఘం మౌసావత్ డైరెక్టర్ కూడా అయిన ఆమె న్యాయవాది జాఫర్ ఫరా చెప్పారు. 37 ఏళ్ల నటి అనేక ధారావాహికలు, సినిమాలు, నాటకాలలో నటించింది. ఇదే విధంగా పోస్ట్ చేసిన అరబ్ ఇజ్రాయెలీ గాయకుడు దలాల్ అబు అమ్నే నిర్బంధించబడ్డారు. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజా నివాసితులకు సంఘీభావం తెలిపే వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ అరబ్ మైనారిటీ సభ్యులు, తూర్పు జెరూసలేంలో పాలస్తీనియన్లను అనేక అనేక మందిని అరెస్ట్ చేసారు. ఇజ్రాయెల్ అరబ్బులు ఇజ్రాయెల్ జనాభాలో ఐదవ వంతు ఉంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







